Jun 20,2022 10:03

రోమ్‌ : లైంగిక వేధింపలు, దాడి ఆరోపణలపై ఆస్కార్‌ అవార్డు కెనడా డైరెక్టర్‌ పాల్‌ హగ్గీస్‌ను దక్షిణ ఇటలీలోని ఓస్తునీలో అరెస్టు చేశారు. ఈమేరకు స్థానిక న్యాయవాదులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా సంస్థలు ఆదివారం పేర్కొన్నాయి. దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌ పాల్‌.. ఓ విదేశీ యువతిని లైంగికంగా వేధించడంతో పాటు గాయపరిచినట్లు అనుమానిస్తున్నందున పోలీసుల అరెస్టు చేశారని బ్రింద్సీ ప్రాసిక్యూటర్స్‌ తెలిపారు. కాగా, పాల్‌ తరుపు న్యాయవాది.. పాల్‌పై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను నిర్ధోషినని, వీలైనంత త్వరగా విచారించాలని పాల్‌ విజ్ఞప్తి చేసినట్లు న్యాయవాది తెలిపారు. 69 ఏళ్ల పాల్‌ ఆస్కార్‌ గెలిచిన క్రాష్‌ చిత్రాన్ని రచించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.