
- ప్రాధాన్యతా ప్రాజెక్టుల ప్రస్తావన నిల్
- సాగునీటి రంగానికి రూ 11,908 కోట్లు
- పోలవరానికి రూ 5,414 కోట్లు
- పునరావాసానికి నామమాత్రపు కేటాయింపులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో జలవనరులశాఖకు చేసిన కేటాయింపు రైతులకు నిరాశనే మిగిల్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా దాదాపు రూ.25 వేల కోట్లు అవసరం కాగా, ప్రస్తుతం పురోగతిలో వున్న ప్రాజెక్టులు పూర్తికావాలంటే దాదాపు రూ.75 వేల కోట్లకు పైగా కావాలని జలవనరులశాఖ అంచనా. అయితే ఈ బడ్జెట్‌లో రూ.11,908 కోట్లను మాత్రమే కేటాయించింది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్లలో సాగునీటి రంగానికి ఏటేటా నిధులు తగ్గిస్తూ వచ్చిన ప్రభుత్వం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం రూ 500 కోట్లుమాత్రమే పెంచింది. అవసరాలతో పోల్చుకుంటే ఇది ఏ మూలసకూ సరిపోదు. గత ప్రభుత్వ హాయంలో 2018-19 బడ్జెట్‌లో రూ.16,978 కేటాయిస్తే ఈ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌లోనే భారీగా కోతలుపెట్టి 2019 -20లో రూ.13,139 కోట్లను కేటాయించింది. 2020-21లో రూ.11,805 కోట్లు, 2021-22లో రూ 12,431 కోట్లు, 2022-23లో 11,482 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులకు రూ 1,098 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ 1,450 కోట్లు, భూసేకరణ కోసం రూ.1,358 కోట్లు కలిపి మొత్తం రూ.5,414కోట్లను కేటాయించింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కేటాయింపులు అరకొర చేశారు. రాష్ట్రంలో ప్రధాస ప్రాజెక్టుల కేటాయింపులు ఇలా వున్నాయి. కోట్లలో
