May 25,2023 06:51

ఎండాకాలంలో తరుచుగా ఛాతిలో, కడుపులో మంటపుడుతూ ఉంటుంది. అప్పుడు చాలామంది కూల్‌డ్రింక్స్‌ లేదా కూలింగ్‌ వాటర్‌ తాగుతారు. వీటికన్నా పెరుగుతో చేసిన లస్సీగానీ, పెరుగు గానీ తీసుకుంటే సమస్య తగ్గుతుంది. పెరుగులో శరీరానికి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

  •  కొందరికి ఏ ఆహారం తీసుకున్నా కడుపులో మంట వస్తుంది. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి రావటం వల్లే. ఇలాంటివారు రోజూ పరగడుపున ఒక కప్పు పెరుగు తింటే చాలా మంచిది. మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది
  •  ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్‌ చాలా తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.
  •  పెరుగు శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడుతుంది. అందుకే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. హైబీపీ కూడా అదుపులోకి వస్తుంది.
  •  పని వల్ల బాగా ఒత్తిడికి గురైనవారు పెరుగు తీసుకుంటే అలసట తీరుతుంది. మంచి నిద్రలోకి వెళ్లి మెదడుపై ఒత్తిడి తగ్గిస్తుంది. అందుకే రోజూ పెరుగన్నం తినమని పెద్దలు అంటుంటారు.
  •  పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్పరస్‌ కూడా ఉంటుంది.