Jan 31,2023 18:48

నవీన్‌ చంద్ర హీరోగా గాయత్రీ సురేష్‌, పూజా జవేరి హీరోయిన్స్‌గా, జీ.ఎస్‌. కార్తీక్‌ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'మాయగాడు'. స్వాతి పిక్చర్స్‌ బ్యానర్‌పై, భార్గవ్‌ మన్నె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. పైరసీ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్‌ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా విడుదలకానుంది.