Oct 03,2022 21:49

వాటికన్‌ : ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కాల్పుల విరమణను ప్రకటించి, చర్చలు జరపాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ కోరారు. ఆదివారం ఇరువురు నేతలకు ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే, అణ్వాయుధాల మోహరింపునకు దారి తీయవచ్చని, అదే గనుక జరిగితే విపత్కర పర్యవసానాలు ఎదురవుతాయని హెచ్చరించినట్లు వాటికన్‌ న్యూస్‌ తెలిపింది. ఉక్రెయిన్‌ ఘర్షణ మానవాళికి భయంకరమైన, కోలుకోలేని గాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి కనుచూపు మేరలో ముగింపు కనిపించడం లేదన్నారు. కొనిు చర్యలను ఎనుటికీ సమర్ధించలేమన్నారు. యుద్ధమనేది ఎనుటికీ పరిష్కార మార్గం కాదన్నారు. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని పిలుపునిచ్చారు. బల ప్రయోగంతో ప్రజలపై రుద్దే పరిష్కారాలు కాదు, ఏకాభిప్రాయంతో, న్యాయంగా, స్థిరంగా వుండే పరిష్కారాలు కావాలన్నారు. ప్రతి ఒక్క దేశం సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలన్నారు. మైనారిటీల హక్కులు రక్షించబడాలన్నారు.