
న్యూఢిల్లీ : అమెరికన్ టెక్నలాజీ కంపెనీ వియు భారత మార్కెట్లోకి కొత్తగా 43, 55 అంగుళాల్లో ప్రీమియం టివి 2023 ఎడిషన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. వీటి ధరలు వరుసగా రూ.23,999గా, రూ.32,999గా నిర్ణయించినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో వీటిని అమ్మకానికి పెట్టినట్లు తెలిపింది. స్పష్టమైన చిత్రం కోసం ఎ ఫ్లస్ గ్రేడ్ 400 ఎన్‌ఐటిఎస్ ప్రకాశవంతమైన ఐపిఎల్ ప్యానెల్‌ను కలిగి ఉందని వెల్లడించింది.