
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడకు రానున్నారు. అదే రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పౌర సన్మానానికి హాజరవుతారు. 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలో బయలుదేరి 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి తాడిగడపలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగే ప్రభుత్వ పౌర సన్మానానికి హాజరవుతారు. అనంతరం రాజ్‌భవన్‌కు వస్తారు. అక్కడ గౌరవ విందులో పాల్గొన్న అనంతరం రెండుగంటలకు ప్రత్యేక విమానంలో విశాఖలోని నావల్ ఎయిర్‌స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు వెడతారు. అక్కడ జాతీయ రహదారుల విభాగం ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. రాత్రికి తిరుమల చేరుకుంటారు. 5వ తేదీ ఉదయం తిరుమలలో దర్శనం అనంతరం గోశాలను సందర్శించనున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు.