Jul 05,2022 13:05

అనంతపురం : ఆశావర్కర్ల వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ... ఆశావర్కర్లు అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ నెల 14 వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. సోమవారం ఉదయం అనంతపురంలోని ఆశావర్కర్లంతా తమ సమస్యలను తెలుపుతూ అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ .... పెరిగిన ధరల కారణంగా ఆశావర్కర్ల వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని కోరారు. పనిభారాన్ని తగ్గించాలని, సంక్షేమ పధకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని అడిగారు. కోవిడ్‌ కాలంలో మరణించిన ఆశాల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియో ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. తమ సమస్యలపై చాలాసార్లు వినతిపత్రాలు ఇచ్చామని ఇప్పటికైనా తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. లేని ఎడల ఈనెల 14 తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.