Jun 24,2022 08:23

జి.కొత్తపల్లి (ఏలూరు) : ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన గంజి ప్రసాద్‌ హత్యకేసులో నిందితుడు, రిమాండ్‌ ఖైదీ రవితేజ ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి పరారయ్యాడు. గత కొద్ది రోజులుగా నిందితుడు రవి తేజ అనారోగ్య కారణాలతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈక్రమంలో ఆసుపత్రి నుండి ఖైదీ పరారవ్వడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.