Jan 31,2023 13:14

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తొలిసారి తన కుమార్తెను పరిచయం చేసింది. పాప పుట్టి నెలలు గడుస్తున్నా.. ప్రియాంకచోప్రా సోషల్‌ మీడియాలో తన కుమార్తె ముఖాన్ని చూపించకుండా జాగ్రత్తపడ్డారు. ఆమె తాజాగా జొనాస్‌ బ్రదర్స్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఈవెంట్‌లో పాప మాల్తీతో కలిసి వేడుకలకు హాజరైంది. ఈ వేడుకల్లో ఆమె తన గారాల పట్టితో ఎంజారు చేస్తున్న ఫొటోలు కెమెరా క్లిక్‌మనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో తెల్లని ఫ్రాక్‌లో తల్లి ఒళ్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీని చూసి క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.
కాగా, ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్‌ 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఆమె బిడ్డను కన్న సంగతి తెలిసిందే.

priyanka


 

priyanka  2

 

priyanka 3

 

priyanka 2

 

priyanka 3