Aug 13,2022 14:29

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం శనివారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్యవహరించనున్నారు. త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.