
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ... నార్పల మండలం వెంకటాంపల్లి వద్ద తాడిపత్రి ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. రైతులు రోడ్డును దిగ్బంధనం చేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటలతరబడి నిరసన వ్యక్తం చేస్తున్నా రైతులను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు అసహనాన్ని వ్యక్తం చేశారు.