
ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూలు) : ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ దేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్లులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు పాటిల్ సుధాకర్ రెడ్డి, మధు యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సిఎం జగన్ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన, అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరు తదితర వాటిని గడపగడపకు వెళ్లి ప్రజల నుండి అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టక పోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటిల్ హారిక రెడ్డి, జగన్నాథ రెడ్డి, మోహన్ రెడ్డి,నగేష్ యాదవ్, తుగ్గలి మోహన్ రెడ్డి, తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి, అట్లా గోపాల్ రెడ్డి, జడ్పిటిసి పులికొండ నాయక్, హనుమంతు, నాగభూషణం రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చాంద్ బాషా,విద్యా కమిటీ చైర్మన్ నాగరాజు, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.