Jan 27,2023 12:56

నార్పల (అనంతపురం) : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ... పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ ఆకుల విజయకుమార్‌ ఆధ్వర్యంలో నార్పల మండలంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధిగాంచిన శ్రీవెంకటేశ్వర ఆలయం, కాశీవిశ్వేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తలారి తిప్పన్న, బాలనాగి నరేష్‌, మండల మాజీ కోఆప్షన్‌ సాలేహ, మాజీ ఎంపీటీసీ వేణు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.