
- ఈ సీజన్లో దొరికే గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.
- గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవడం వల్ల చెక్కరస్థాయి కూడా తగ్గుతాయి. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. అందువల్ల క్యాలరీలు కూడా తక్కువగా లభిస్తాయి.
- గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. గుమ్మడి కాయల్లో ఉండే లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి.
- గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు వైరస్ల బారి నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
- గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్ సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్ (అతి నీలలోహిత) కిరణాల బారి నుంచి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. గుమ్మడికాయ గుజ్జును ఫేస్ మాస్క్‌గా వేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి.
- ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఎ, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లకు కారణం అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ప్రోస్టేట్, ఊపిరి తిత్తుల క్యాన్సర్లు రాకుండా ఉంటాయని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.