
ఖతార్ : ఫిఫా ప్రపంచకప్ నుంచి ఖతార్ జట్టు నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో సెనెగల్ 3 - 1తో ఖతార్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు స్ట్రయికర్ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్ అందించారు. ఫమారా 48వ నిమిషంలో చేసిన గోల్ తో సెనెగల్ అధిక్యం 2 -0కి పెరిగింది. 78 నిమిషంలో మొహమ్మద్ ముంటారి గోల్ చేయడంతో ఖతార్ 1-2తో రేసులోకి వచ్చినా ఈక్వెడార్ ఆటగాడు బంబా డియెంగ్ సెనెగల్‌కు మూడో గోల్ చేశాడు. దీంతో ఖతార్ ఓటమి చెందింది. జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్ దారులు మూసుకుపోయాయి.