May 25,2023 19:19

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ షాదన్‌ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలను ఢకొీంటూ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులు త్రుటిలో తప్పించుకున్నారు. ఆర్టీసీ బస్సు అదుపు తప్పడం గమనించిన వాహనదారులు భయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆర్టీసీ బస్సు చక్రాల కింద రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు బస్సు డ్రైవర్‌ పై దాడికి యత్నించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.