Jun 02,2023 14:38

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీలక పాత్ర అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్‌ పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ జీవితాలను, ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారని గుర్తు చేశారు.
ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెను కొనసాగించారని.. 56,604 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కఅషిచేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గని బస్సు చక్రాలను ఆపడం వల్లే సకల జనుల సమ్మె ఉదఅతమైందని.. విజయవంతం కూడా అయిందని అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పాల్గని.. రాష్ట్రం ఏర్పడేవరకు నిరంతరంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉద్యోగులు నిలవడం సంస్థకు గర్వకారణమని ప్రశంసించారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గత 9 ఏండ్లలో టీఎస్‌ఆర్టీసీలో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని వీసీ సజ్జనార్‌ తెలిపారు. ప్రజల సహకారం, ఉద్యోగుల కఅషితో టీఎస్‌ఆర్టీసీకి ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.