Nov 26,2022 14:49

హైదరాబాద్‌: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజ్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. ధర్మాన్ని కాపాడుతున్న ఇద్దరు న్యాయమూర్తులను శుక్రవారం బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసిన అంశంపై కిరణ్‌ రిజీజ్‌కు రఘురామ లేఖ రాశారు. న్యాయమూర్తుల బదిలీ అంశాన్ని మరోసారి పునసమీక్షించాలని లేఖలో కోరారు. కొలీజియం నిర్ణయాన్ని పున: సమీక్షించాలన్నారు. న్యాయాన్ని కాపాడే వారిని కూడా బదిలీ చేస్తే ఎలా అని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.