
- హాకీ చరిత్రలో తొలిసారి
లక్నో: భారత మహిళల హాకీజట్టు కెప్టెన్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్ బరేలీలోని ఎంసిఎఫ్ హాకీ స్టేడియంకు 'రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్'గా మార్పు చేసింది. ఆ స్టేడియంను రాణి రాంపాల్ మంగళవారం స్టేడియంను ప్రారంభించింది. ఆ ఫొటోలను రాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాణి రాంపాల్ ఆ పోస్ట్‌లో హాకీ క్రీడను తాను చేసిన సహకారానికి గుర్తింపుగా ఓ స్టేడియంకు తన పేరును జోడించడం సంతోషించదగ్గ పరిణామమని, ఇది యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని ట్విట్టర్‌లో పేర్కొంది. దీంతో హాకీ క్రీడా చరిత్రలో ఓ స్టేడియంకు మహిళా హాకీ ప్లేయర్ పేరును పొందిన తొలి మహిళగా క్రీడాకారిణిగా రాణి తమ ముద్రను వేసుకుంది.