Aug 19,2022 09:23

ప్రజాశక్తి-అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు లేదంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.