Mar 19,2023 19:08

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.శనివారం ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంaదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.