Jun 22,2022 20:07

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ'. శరత్‌ మందవ దర్శకత్వంలో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ జూన్‌ 17న విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల చేత విడుదల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్‌ ఒక కొత్త పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 29న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాణం వహించిన ఈ చిత్రంలోదివ్యాన్షా కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. సామ్‌ సి ఎస్‌ సంగీతం అందిస్తున్నాడు.