
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ఆర్థికశాఖ (పే అండ్ అకౌంట్స్) కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న గన్నవరానికి చెందిన కిలారు రణదీర్కుమార్ 24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి దేవిడ్ ప్రేమ్‌నాథ్ తెలిపారు. ఈ నెల 29 నుంచి జులై 10వరకు ఫిన్లాండ్లో నిర్వహించే ఈ పోటీల్లో ఆయన పాల్గోనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.