May 25,2023 21:20

ముంబయి : ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ అబాన్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ గతేడాది మెరుగైన ప్రగతిని కనబర్చినట్లు తెలిపింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్థితో రూ.70.3 కోట్ల నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. ఇంతక్రితం ఏడాదిలో రూ.61.8 కోట్ల లాభాలు నమోదు చేసినట్లు పేర్కొంది. ఇదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.638.62 కోట్లతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో 80.2 శాతం వఅద్ధితో రూ.1,150.97 కోట్లుగా చోటు చేసుకుంది.