
-ముంబయి 248/5
బెంగళూరు: మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ ఫైనల్లో ముంబయి జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ాకెప్టెన్ పృథ్వీ షా రాణించారు. ఆ తర్వాత సర్ఫరాజ్ కూడా సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో ముంబయి జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది. జైస్వాల్(78) అర్ధసెంచరీని నమోదు చేయగా.. పృథ్వీ షా(47) తృటిలో అర్దసెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత అమన్ జాఫర్(26), సువేద్ పార్కర్(18) నిరాశపరిచినా.. సర్ఫరాజ్ ఖాన్(40నాటౌట్), సామ్స్ ములానీ(12) మరో వికెట్ పడకుండా జ్గారత్తగా ఆడారు. ఇకెట్ కీపర్ హార్దిక్ థమోర్(24) ఫర్వాలేదనిపించాడు. తొలి వికెట్‌కు పృథ్వీ షాాయశశస్వి కలిసి 87 పరుగుల భారీ భాగస్వామ్యానిÊ నెలకొల్పారు. ఐదురోజులపాటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఫైనల్ ఐదు రోజులపాటు జరగనుంది. అనుబవ్ అగర్వాల్, శరన్ జైన్‌కు రెండేసి, కార్తికేయకు ఒక వికెట్ లభించాయి.