
హైదరాబాద్ : ప్రముఖ కోలీవుడ్ నటుడు విజరు నటిస్తోన్న తాజా చిత్రం 'వారిసు'. ఈ చిత్రంలో ప్రముఖ నటి రష్మిక విజరుకి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలోని 'రంజితమే' సాంగ్‌ని నటుడు విజరునే ఆలపించారు. ఈ సాంగ్ తమిళ్ వెర్షన్ విడుదలైన 25 రోజులకే 7 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళుతూ.. కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రం తెలుగులో 'వారసుడు' అనే టైటిల్‌తో విడుదల కాబోతుంది. ఈ పాటను తెలుగు వెర్షన్‌ని చిత్రయూనిట్ బుధవారం (నవంబర్ 30)న విడుదల చేసింది. తెలుగులో ఈ పాటని అనురాగ్ కులకర్ణి, ఎం.ఎం. మానసి ఆలపించారు. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ బాణీలు సమకూర్చారు. ప్రముఖ డైరెక్టర్ వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.