
న్యూఢిల్లీ : ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ వీగన్ స్కిన్‌కేర్ బ్రాండ్ ఫ్లమ్కు ప్రచారకర్తగా నటి రష్మిక మందన్నను నియమించుకుంది. అదే విధంగా రష్మిక తమ సంస్థలో ఇన్వెస్టర్‌గా చేరారని ఆ సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా 250కు పైగా పట్టణాలు, నగరాలలో తమ బ్రాండ్ 1,000కు పైగా సహాయక రిటైల్ ఔట్లెట్లు, 10,000కు పైగా అన్ అసిస్టెడ్ ఔట్లెట్లు కలిగి ఉందని పేర్కొంది. ప్రస్తుతం రూ.300 కోట్ల రెవెన్యూ కలిగిన తమ సంస్థ వచ్చే 12 మాసాల్లో రెట్టింపు ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుందని వీగన్ స్కిన్‌కేర్ తెలిపింది.