Sep 17,2023 11:59

చెన్నై : '' చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లాలనుకున్నా... అయితే ఫ్యామిలీ ఫంక్షన్‌ కారణంగా అది కుదరలేదు '' అని ప్రముఖ నటుడు రజనీకాంత్‌ అన్నారు. ఆదివారం ఉదయం రజనీకాంత్‌ తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గనడానికి చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ను కలిసిన మీడియా ప్రతినిధులు ... చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎప్పుడు వెళతారు ? అని అడిగారు. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లాలనుకున్నట్లు తెలిపిన రజనీకాంత్‌.. అయితే ఫ్యామిలీ ఫంక్షన్‌ కారణంగా అది కుదరలేదని చెప్పారు. కొద్దిరోజులుగా... రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్‌ అయ్యేందుకు రజనీకాంత్‌ ఒకటి రెండు రోజుల్లో చెన్నై నుంచి అక్కడకు వస్తారని ప్రచారం జోరందుకుంది. చంద్రబాబు, రజనీకాంత్‌ మధ్య దశాబ్ధాలుగా ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈరోజు రజనీకాంత్‌ చెప్పిన మాటలను బట్టి ఆయన చంద్రబాబును కలవడం లేదని స్పష్టమయ్యింది. అయితే రజనీకాంత్‌ కామెంట్స్‌పై వైసిపి నేతలు తీవ్రంగా స్పందించారు.

 

;