Jun 24,2022 09:06

ముంబయి : తమకు 50 మంది ఎమ్మెల్యేలకు పైగా మద్దతు ఉందని మహారాష్ట్రలో సంక్షోభానికి కారణమైన ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. వీరిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని అసోంలో గువహటిలో మకాం వేసిన ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరింత మంది ఎమ్మెల్యేలు తమ క్యాంపులో చేరనున్నట్లు పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉన్న వాళ్లు తమతో కలుస్తారని అన్నారు. బాలాసాహెబ్‌ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని, నచ్చిన వాళ్లు తమతో వస్తారని వ్యాఖ్యానించారు. తమపై అనర్హత వేటు వేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ధాకరే నోటీసులు దాఖలు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ' నిన్న ఉద్ధవ్‌ థాకరే చేసింది చట్టవిరుద్ధం, వారికి ఆ హక్కు లేదు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ మాపై ఉంది. ఇక్కడ సంఖ్య ముఖ్యం. మమ్మల్ని సస్పెండ్‌ చేయలేరు' అన్నారు.