Nov 25,2022 09:13

బీజింగ్‌ : చైనాలో బుధవారం రోజువారీ కరోనా కేసులు రికార్థు స్థాయిలో నమోదయ్యాయి. బుధవారం చైనా వ్యాప్తంగా 31,444 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు గురువారం తెలిపారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం చైనాలో ఇదే మొదటిసారి. ఇందులో 3,927 కేసుల్లో లక్షణాలు వుండగా, 27,517 కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేవని ఆరోగ్య అధికారులు తెలిపారు.