Jul 01,2022 13:23

విజయనగరం : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీవారు విజయనగరంలోని స్థానిక మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులను శనివారం పరామర్శించి రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ మేనేజర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... రెడ్‌ క్రాస్‌ సేవ కార్యక్రమాలలో భాగంగా, జాతీయ వైద్యుల రోజు సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్నీ నిర్వహించామన్నారు. ప్రతి రోగి దగ్గరికి వెళ్లి పరామర్శించామని, పరిశుభ్రత తో ఉండాలని, త్వరగా అనారోగ్యం నుండి కోలుకోవాలని చెప్పారు. ప్రతి నెల మొదటి వారంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ జిల్లా మేనేజింగ్‌ సభ్యులు బి.రామకఅష్ణ రావు, జిల్లా జూనియర్‌ కోఆర్డినేటర్‌ ఎం.రామ్మోహన్‌రావు, రెడ్‌ క్రాస్‌ జిల్లా కోఆర్డినేటర్లు గౌరి శంకర్‌, చంద్రరావు, రావు ఏ.పి.ఆర్‌.ఓ ఎం. రాము, జీవితకాల సభ్యులు నగేష్‌, గంగ ప్రసాద్‌, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.