Jul 01,2022 20:17

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సమాజ సేవకు ప్రతిరూపంగా ఆపదలో ఉన్న వారికి అండగా రెడ్‌క్రాస్‌ అందిస్తున్న సేవలు అనుసరణీయమని గవర్నరు విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ శ్రీకాకుళం శాఖ ఛైర్మన్‌ పి జగన్మోహన్‌రావుకు భారత ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రశంసాపత్రాన్ని గవర్నరు అందజేశారు. మరోవైపు రెడ్‌క్రాస్‌ సభ్యత్వంలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నందుకు ఎపి రెడ్‌క్రాస్‌ సొసైటీ తరపున అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి ఎకె ఫరీడాకు రాష్ట్రపతి అవార్డు, ప్రశంసాపత్రాలను అందజేశారు. 15 ఏళ్లకు పైగా గణనీయమైన సేవలందించిన వారికి దక్కే అరుదైన గౌరవం జగన్మోహన్‌రావుకు దక్కడం మంచి పరిణామమని గవర్నరు అన్నారు.