Sep 27,2022 08:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మా కళాశాలల్లో యాజమాన్య (కేటగిరి-బి) సీట్ల భర్తీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 2022-23 విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ మంగళవారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అక్టోబరు 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని, మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారం 14న ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. .