Jun 24,2022 07:59

ప్రజాశక్తి-హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు చంచల్‌ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయన ములాఖత్‌ అవనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయవాదులను కూడా నియమించనున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.