Aug 08,2022 12:25

వైఎస్‌ఆర్‌ : అప్రోచ్‌ రోడ్డుపై రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. భారీ వరదలకు కడప తాడిపత్రి జాతీయ రహదారి పై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ రోడ్డును త్వరితగతిన పునరుద్ధరించారు. సోమవారం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఆ రోడ్డును పున: ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ... అప్రోచ్‌ రోడ్డు పై రాకపోకలు పునరుద్ధరించామన్నారు. యుద్ధప్రాతిపదికన రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారని తెలిపారు. రహదారి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షించామని తెలిపారు. రెండు రోజుల్లో రహదారి పునర్నిర్మాణంపై వాహనదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు.