Oct 02,2022 11:01

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌-2022 ఫైనల్లో ఇండియా లెజెండ్స్‌ విజయం సాధించింది. శ్రీలంక లెజెండ్స్‌పై 33 పరుగుల తేడాతో గెలిచి రెండో సారి కప్‌ను అందుకుంది. తొలుత టాస్‌ గెలిచిన ఇండియా లెజెండ్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నమన్‌ ఓజా అద్భుత సెంచరీ (71 బంతుల్లో 108 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు, నాటౌట్‌), వినరు కుమార్‌ 36 యువరాజ్‌ సింగ్‌ 19, ఇర్ఫాన్‌ పఠాన్‌ 11 సచిన్‌ (0), సురేశ్‌ రైనా (4) పరుగులతో ఇండియా లెజెండ్స్‌ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కులశేఖరకు మూడు, ఇసురు ఉడానాకు రెండు వికెట్లు, ఇషాన్‌ జయరత్నేకు ఒక వికెట్‌ దక్కాయి.

ind l


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్‌ దిల్షాన్‌ మునవీర (8) సనత్‌ జయసూర్య (5), కెప్టెన్‌ తిలకరత్నె దిల్షాన్‌ (11), ఉపుల్‌ తరంగ(10) అసీల గుణరత్నె(19), జీవన్‌ మెండిస్‌(20) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. ఆఖరిలో ఇషాన్‌ జయరత్నె అర్ధ శతకం(22 బంతుల్లో 51 పరుగులు), మహేల ఉదవటె(19 బంతుల్లో 26 పరుగులు) చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేసిన ఇండియా లెజెండ్స్‌ బౌలింగ్‌లో తెలిపోయారు. దీంతో శ్రీలంక లెజెండ్స్‌ 18.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో రెండోసారి ట్రోఫీ ఇండియా లెజెండ్స్‌ సోంతం చేసుకుంది. మ్యాన్‌అఫ్‌ది మ్యాచ్‌గా నమన్‌ ఓజా నిలిచాడు.