
ఇంగ్లండ్‌తో టి20, వన్డే సిరీస్‌కు జట్లను ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ.. టి20, వన్డే సిరీస్‌లకు అందుబాటులోకి రానున్నాడు. జులై 7నుంచి జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మ అందుకోనున్నాడు. బిసిసిఐ ఇంగ్లండ్‌తో మూడు టి20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌కు శుక్రవారం వేర్వేరుగా జట్లను ప్రకటించింది. విరాట్ కోహ్లితో ఇతర రెగ్యులర్ ఆటగాళ్లు రెండో టీ20 నుంచి జట్టుకు అందుబాటులోకి రానున్నారు.
ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బట్లర్
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) కొత్త సారథిని ఎంపిక చేసింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ఓపెనర్ జోస్ బట్లర్‌కు వన్డే, టీ20లకు కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు బోర్డు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2011 నుంచి ఇంగ్లండ్‌కు ఆడుతున్న బట్లర్.. కెరీర్లో ఇప్పటివరకు 57టెస్టులు, 151వన్డేలు, 88టీ20లు ఆడాడు. టెస్టులలో 2,907, వన్డేలలో 4,120, టీ20లలో 2,140 పరుగులు చేశాడు.
తొలి టీ20: రోహిత్(కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
రెండు, మూడు టీ20: రోహిత్(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోరు, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే సిరీస్‌కు జట్టు: రోహిత్(కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఆర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లండ్ టి20 జట్టు: బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, బ్రూక్స్, శామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, జోర్డాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, పార్కిన్సన్, జేసన్ రారు, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లీ.
ఇంగ్లండ్ వన్డే సిరీస్ జట్టు: బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, బ్రూక్స్, బ్రాడన్ కార్స్, శామ్ కర్రన్, లివింగ్‌స్టోన్, ఓవర్టన్, పార్కిన్సన్, రూట్, జేసన్ రారు, సాల్ట్, బెన్ స్టోక్స్, టాప్లే, డేవిడ్ విల్లీ.
షెడ్యూల్..
జులై 7 : తొలి టి20(సౌథాంప్టన్)
జులై 9 : రెండో టి20(ఎడ్జ్‌బాస్టన్)
జులై 10 : మూడో టి20(నాటింగ్‌హామ్)
జులై 12 : తొలి వన్డే(ఓవల్)
జులై 14 : రెండో వన్డే(లార్డ్స్)
జులై 16 : మూడో వన్డే(ఓల్డ్‌ట్రఫోర్డ్)