Feb 06,2023 18:46

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేశ సంపదను తన బినామీ కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, దేశానికి ముప్పుగా పరిణమించాయని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 9న అదాని ఆర్థిక కుంభకోణంపై విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఉదయం 10:30 గంటలకు రాష్ట్రస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రౌండ్‌టేబుల్‌ సమావేశానికి రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.