Aug 09,2022 21:52

మాస్కో : ఇరాన్‌ ఉపగ్రహాన్ని రష్యా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. కజకస్తాన్‌లోని బైకనూర్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో మంగళవారం ఉదయం 8.52గంటలకు సోయుజ్‌ రాకెట్‌ ఖయ్యూమ్‌ ఉపగ్రహానిు ప్రయోగించింది. అనంతరం 9నిముషాలకు ఆ ఉపగ్రహానిు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 11, 12 శతాబ్దాల్లో జీవించిన పర్షియన్‌ శాస్త్రవేత్త ఒమర్‌ ఖయ్యూమ్‌ పేరును ఈ ఉపగ్రహానికి పెట్టారు. ఈ ఉపగ్రహానికి హై రిజల్యూషన్‌ కలిగిన కెమెరాను పెట్టినట్లు ఇరాన్‌ తెలిపింది. పర్యావరణ పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని, పూర్తిగా తమ అధీనంలో వుంటుందనిపేర్కొంది. ఈ ఉపగ్రహం సేకరించే సమాచారానిు మరే దేశమూ కూడా పొందలేదని తెలిపింది. ఈ సమాచారానిు కేవలం పౌర ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తామని కూడా తెలిపింది. అయితే ఉక్రెయిన్‌లో నిఘా కోసం ఈ ఉపగ్రహానిు రష్యా ఉపయోగించుకోవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఉపగ్రహం గనుక విజయవంతంగా పనిచేస్తే, తన బద్ధ శత్రువైన ఇజ్రాయిల్‌ను, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలను నిరంతరంగా పర్యవేక్షించే శక్తి సామర్ధ్యాలు ఇరాన్‌కు వుంటాయి. ఉపగ్రహ ప్రయోగాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇరాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ మంత్రి స్వయంగా హాజరయ్యారు.