Sep 22,2022 15:46

న్యూయార్క్  : రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు) సిద్ధమైంది. బుధవారం జరిగిన అనధికారిక సమావేశంలో రష్యా లక్ష్యంగా కొత్త ఆంక్షలతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి యుద్ధ సమీకరణ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయు విదేశాంగ విధాన చీఫ్‌ తెలిపారు. న్యూయార్క్‌లో జోసెఫ్‌ బోరెల్‌ మీడియాతో మాట్లాడుతూ.. 27 రాష్ట్రాలు రష్యాపై కొత్త ఆంక్షలు, వ్యక్తిగత చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయని అన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాల సరఫరాను కొనసాగించనున్నట్లు తెలిపింది.