Jun 24,2022 06:42

గల్లి గల్లీ పారజూసినా
ఒట్టి లొల్లి యాసంగం తప్ప
పల్లె సల్లంగుంది లేదు
జర ఇసుమంత రచ్చకు
మస్తుగా ఏలిక మడతెట్టి
గుంజుడు ఊసు తప్ప
గంజి పోసింది లేదు
రవ్వంత పనిని
కొండంత పెంచుడు తప్ప
ఊరికి ఉపకారం చేసింది లేదు
ఏదీ ఎరుకైతలేదు
పరేషాన్‌ పడకండని
పొర్లిచ్చి పొర్లిచ్చి వాగ్ధానమిచ్చినా
నాగలి భూమిని దున్నుతాలేదు
రైతున్న ఊరు ఉసూరుమంటా
అరువు బండపై తలొగ్గిన
కళ్ళిప్పి తేరిపార చూసింది లేదు
గాలిడిసిన నేల
గాబరా పడతా బీడున్నా
జరంత కనికరం
అణువంతైనా కానరాకుండే
బయలెళ్ళిన బతుకుబండి
కాళ్ళీడుత్తా సాగిపోయినా
దంచుడు తప్ప ఆపుడు లేకుండే
సినబోయింది తప్ప
సారం ఒంపింది లేదు
ఏదీ ఎరుకైతలేదనుకో
చుట్టూరా మస్తుగుండ్రని
బల్లగుద్ది అరవడమేగాని
ఏమరపాటుకు తలొంచిన లెక్క
ఇప్పటికీ ఎరుకైతలేకుండే
చిగురు తొడిగిన నేల
నష్టం లేకుండా నవ్వింది లేదు
అంతర్గత బతుకు బాధ దారిలో
ఏ రైతూ నడవకపోయింది లేదు
ఏంటో ఏమీ ఎరుకైతలేదు సుమీ.
- నరెద్దుల రాజారెడ్డి
సెల్‌ : 9666016636