Mar 21,2023 20:37

ప్రజాశక్తి-మెంటాడ (విజయనగరం జిల్లా) : ప్రజాశక్తి విజయనగరం జిల్లా శృంగవరపుకోట డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ కోడూరు వెంకటరావు తల్లి కోడూరు రామయ్యమ్మ (70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె విశాఖలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. స్వగ్రామం విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరులో అంత్యక్రియలు నిర్వహించారు. రామయ్యమ్మ భౌతికకాయాన్ని ప్రజాశక్తి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వై.అచ్యుతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, మఫిషియల్‌ స్టేట్‌ ఇన్‌ఛార్జి ఎస్‌.శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు, సమన్వయ కమిటీ కన్వీనర్‌, సభ్యులు, సిబ్బంది నివాళులర్పించారు. వెంకటరావు కుటుంబానికి ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌ సానుభూతి తెలిపారు.