
ప్రజాశక్తి - కర్నూలు క్రైం : పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పి సిధ్దార్థ్ కౌశల్ కౌతాళం మండలం, కామవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్ ను శుక్రవారం తెల్లవారుజామున తనిఖీ చేశారు. పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది గ్రామంలో 24x7 అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో పెట్రోలింగ్ చేస్తూ ఏలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం మంత్రాలయం నుండి వచ్చిన దళిత సంఘం నాయకులు ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని దళితుల సమస్యలను పరిష్కరించాలని ఎస్పికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పి కె.ఎస్ వినోద్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, ఆదోని తాలుకా ఇన్ స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస రెడ్డి, కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి ఉన్నారు.