Jun 28,2022 16:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : బాలీవుడ్‌ స్టార్‌ అక్షరుకుమార్‌ నటించిన తాజా చిత్రం 'సమ్రాట్‌ పృథ్వీరాజ్‌'. ఈ చిత్రం జూన్‌ 3న భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఈ సినిమాను నిర్మించేందుకు ఖర్చు పెట్టిన బడ్జెట్‌లో సగం కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయిందని టాక్‌. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూల్‌ 1 నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ తాజాగా వెల్లడించింది.
కాగా, ఈ సినిమా హిట్‌ కొట్టకపోయినా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ పాత్రకి అక్షరుకుమార్‌ ప్రాణం పోశాడు. ఈ చిత్రంలో అక్షరుకుమార్‌కి జోడీగా మానుషి చిల్లర్‌ నటించింది. అలాగే సంజరుదత్‌, సోనూసూద్‌ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించగా.. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.