
హెల్సింకి : ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. తన భర్త మార్కస్ రైకోనెన్ నుంచి విడాకులు తీసుకునేందుకు దరాఖాస్తు చేసుకున్నట్లు.. సోషల్‌మీడియా ద్వారా ఆమే స్వయంగా వెల్లడించారు. 'మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మేము భార్యాభర్తలుగా విడాకులు తీసుకున్నా.. మంచి స్నేహితులుగానే కొనసాగుతాం. మా ప్రియమైన కుమార్తెకు మేము తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం మేమిద్దరం సమయాన్ని వెచ్చిస్తాం' అని సనా తన పోస్టులో రాసుకొచ్చారు.
కాగా, వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయిన మార్కస్ రైకోనెస్‌తో సనా మారిన్ కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. ఆమె 2019లో ఫిన్లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత 2020 ఆగస్టులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే చిన్నానాటి స్నేహితులైన వీరిద్దరూ.. పెళ్లైన మూడేళ్లకే వైవాహిక బంధానికి స్వసి పలుకుతూ.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నామని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు.
