
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ప్రజాశక్తి దినపత్రిక విశాఖ యాడ్స్ విభాగంలో పనిచేస్తున్న జి.సంతోష్‌కుమార్‌కు మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి గోపాలశెట్టి సుశీల (80) శనివారం సాయంత్రం విశాఖలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో సంతోష్ 1992 నుంచి ప్రజాశక్తి ఎడివిటి విభాగంలో పని చేస్తున్నారు. సుశీల మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని అంటిపేట గ్రామానికి అంబులెన్సులో తరలించారు. సుశీల మృతికి ప్రజాశక్తి సిజిఎం వై.అచ్యుతరావు, ఎడిటర్ బి.తులసీదాస్, ఎడిటోరియల్ బోర్డు సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, జనరల్ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిపిఎం కార్పొరేటర్ బి.గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, దసపల్లా గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మండవ రాఘవేంద్రరావు తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.