Oct 05,2022 18:57

ప్రజాశక్తి-అనంతపురం :మండలంలోని శాపురం గ్రామానికి చెందిన హేమత్‌ కు ఇస్రో టాలెంట్‌ టెస్ట్‌లో ద్వితీయ బహుమతి లభించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. మండలంలోని శాపురం గామ్రంలో స్థానిక మహాత్మ జ్యోతి రావ్‌పులై పాఠశాలలో హేమంత్‌ 9వతరగతి చదువుతున్నాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్ధికి ఇస్రో టాలెంట్‌ టెస్ట్‌లో ద్వితీయ స్థానం రావడంపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.