Oct 01,2022 22:16

రెస్టాఫ్‌ ఇండియా 205/3
ఇరానీకప్‌

రాజ్‌కోట్‌: ఇరానీ కప్‌ ఫైనల్లో రెస్టాఫ్‌ ఇండియా పట్టు బిగించింది. శనివారం నుంచి ప్రారంభమైన ఇరానీకప్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98పరుగులకే ఆలౌట్‌ చేసింది. సౌరాష్ట్ర జట్టు 5పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దశలో వసవాడ(22), డిఏ జడేజా(28), చివర్లో సకారియా(13నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. దీంతో సౌరాష్ట్ర జట్టు 24.5ఓవర్లలో 98పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ముఖేశ్‌ కుమార్‌కు నాలుగు, కుల్దీప్‌ సేన్‌, ఉమ్రన్‌ మాలిక్‌కు మూడేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన రెస్టాఫ్‌ ఇండియా జట్టు 18పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. కెప్టెన్‌ విహారి(62నాటౌట్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌(125నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో రెస్టాఫ్‌ ఇండియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 205పరుగులు చేసింది. సౌరాష్ట్రపై ఇప్పటికే 107పరుగుల ఆధిక్యతను సంపాదించగా.. ఉనాద్కట్‌కు రెండు, సకారియాకు ఒక వికెట్‌ లభించాయి.