
పూనె : మహారాష్ట్ర పూనెలో టైర్స్ స్క్రాప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ మృతి చెందలేదని అగ్నిమాపక దళ అధికారి వెల్లడించారు. ఈఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పూనె జిల్లాలో పింప్రి చించ్‌వాడ్ టౌన్‌షిప్‌లోని కాసర్‌వాడి ప్రాంతంలో ఉన్న టైర్స్ స్క్రాప్ యార్డ్‌లో మంగళవారం ఉదయం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. 14 ఫైర్ వాహనాల సాయంతో రెస్క్యూ సిబ్బంది ఉదయం 5 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు పింప్రి చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన రెస్క్యూ అధికారి మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనలో 19 మంది క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక దళ అధికారి తెలిపారు.